పెరిగిన బంగారం ధర

ముంబై : కేంద్ర ప్రభుత్వం బంగారంపై దిగుమతి సుంకాన్ని శుక్రవారం 7.5 నుంచి 12.5 శాతానికి పెంచటంతో బంగారం ధరలు అధికమయ్యాయి. ఇప్పటికే బంగారంపై ఉన్న 2.5 శాతం అగ్రికల్చర్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ సెస్, మూడు శాతం జీఎస్టీ భారాలున్నాయి. అంతర్జాతీయంగా బంగారం ధరలు అర శాతం తగ్గడం గమనార్హం. కొద్ది రోజులు అమెరికా డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకూ పడిపోతోంది. దేశం నుంచి విదేశీ పెట్టుబడులు వెనక్కి వెళ్తుండటంతోపాటు బంగారం వంటి వాటి దిగుమతులు పెరుగుతున్నాయి. ముడి చమురు ధరలు చుక్కలను తాకుతున్నాయి. వీటన్నింటి డాలర్లకు డిమాండ్ పెరిగిపోయి రూపాయి విలువ తగ్గిపోతోంది. విదేశ దిగుమతులకు డాలర్లలో చెల్లింపులు చేయాల్సిన పరిస్థితుల్లో ఎక్కువ సొమ్ము చెల్లించాల్సి వస్తోంది. దీంతో బంగారం తగ్గించేందుకు కేంద్రం సుంకాన్ని పెంచింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos