న్యూఢిల్లీ: విధానసభలో గురువారం ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే తన బలాన్ని నిరూపించుకోవాలని గవర్నర్ భగత్‌సింగ్ కోష్యారి ఇచ్చిన ఆదేశాలను పార్టీ చీఫ్ విప్ సునీల్ ప్రభు బుధవారం అత్యున్నత న్యాయస్థానంలో సవాలు చేసారు. ఈ వ్యాజ్యాన్ని విచారించేందుకు న్యాయస్థానం అంగీకరించింది. న్యామూర్తులు సూర్యకాంత్, పర్దివాలా నేతృత్వంలోని ధర్మాసనం సాయంత్రం విచారణ చేపట్టనుంది. బలపరీక్ష నిర్వహించకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని శివసేన కోరింది. శివ సేన తరపున అభిషేక్ సింఘ్వి, శిండే తరపున నీరజ్‌కిషన్ కౌల్ వాదించనున్నారు. గవర్నర్ బలపరీక్ష ఆదేశాలు చట్టవిరుద్ధం అంటూ వాదించిన సింఘ్వితో ధర్మాసనం ఏకీభవించింది.