సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు: చంద్రబాబు

సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు: చంద్రబాబు

అమరావతి: రాష్ట్రంలో బీజేపీ నేతలు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. కేంద్రం ఏపీకి అన్ని ఇస్తుందన్న బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యలపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం నిధులు ఎవరి కోసం ఇస్తుందన్నారు. కొత్తగా రాష్ట్రం ఏర్పడిందని, అన్ని ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. హైదరాబాద్‌, చెన్నైయ్, బెంగళూరులో ఎన్ని ఉన్నాయి? ఏపీలో ఏముందని ఆయన ప్రశ్నించారు. ఎవడబ్బ సొమ్మని, తమాషాగా ఉందా? అంటూ చంద్రబాబు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ప్రజాప్రతినిధులుగా ఉండే అర్హత లేదని, రాష్ట్రంలో ఊడిగం చేస్తారా? అంటూ చంద్రబాబు బీజేపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos