అమరావతి : బీజేపీకి గట్టి దెబ్బ తగిలింది. భాజనపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు, సీనియర్ నేత, మాజీ మంత్రి రావెల్ కిశోర్ బాబు రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు పంపించారు. వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలిపారు. ఐఆర్ఎస్ అధికారిగా పని చేసిన రావెల కిశోర్ బాబు 2014 ఎన్నికలకు ముందు తెదే పాలో ప్రత్తిపాడు విధానసభ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినా మంత్రి పదవిని దక్కించుకున్నారు. ఆ తర్వాత పలు కారణాలతో పదవిని కోల్పోయారు. 2019 ఎన్నికలకు ముందు ఆయన తెదేపా నుంచి జనసేనలో చేరారు. ప్రత్తిపాడు నుంచే పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత జనసేనకు గుడ్ బై చె ప్పి, బీజేపీలో చేరారు. మళ్లీ తెదేపా లో చేరుతారనే ప్రచారం జరుగుతోంది.