న్యూ ఢిల్లీ : భారీ ఎండలు, ఉక్కపోతతో అల్లాడిపోతున్న జనాలకు చల్లటి కబురు. రానున్న 24 గంటల్లో దేశంలోకి నైరుతి రుతు పవనాలు ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అండమాన్ నికోబార్ దీవులకు రుతు పవనాలు వస్తాయి. బంగాళాఖాతం, హిందూ మహా సముద్రంలో రుతుపవనాలు విస్తరిస్తాయని ఈ నెలఖరులోగా కేర ళను తాకుతాయి. జూన్ 8వ తేదీ లోగా తెలంగాణలోకి రుతు పవనాలు ప్రవేశిస్తాయని వివరించింది.