కబ్జా కాదు.. రాజ్ పుత్ ల కానుక

కబ్జా కాదు.. రాజ్ పుత్ ల కానుక

న్యూ ఢిల్లీ : తాజ్ మహల్ కట్టిన ఆ చోటు తమ దేనని ప్రకటించిన జైపూర్ రాకుమారి, బీజేపీ లోక్సభ సభ్యులు దియా కుమారి చేసిన ప్రకటనపై షాజహాన్ సంతతి వారసుడు, ప్రిన్స్ యాకూబ్ హబీబుద్దీన్ ట్యూసీ స్పందించారు. శనివారం ట్విట్టర్ లో వీడియోను విడుదల చేసారు. ఆమె ఒంట్లో ప్రవహించేది రాజ్ పుత్ ల రక్తమే అయితే తాజ్ మహల్ ఉన్న భూమి పత్రాలను చూపించాలి. ఆమెవి పిచ్చి వ్యాఖ్యలు. షాజహాన్ రాజ్ పుత్ లకు వారి తల్లి తరఫు బంధువే అవుతాడు. అక్బర్ భార్య జోధా బాయీ అలియాస్ హర్కా బాయికి షాజహాన్ మనవడు అవుతాడు. షాజహాన్ రెండో భార్య లాల్ బాయి రాజ్ పుత్ . మొఘలులకు రాజ్ పుత్ లు ఆనాడు భూమిని కానుకగా ఇచ్చేవారు. తాజ్ మహల్ కట్టిన స్థలమూ కానుకగానే వచ్చిందే. భూమిని ఆక్రమించారన్న దియాకుమారి వ్యాఖ్యలు నిరాధారమైనని. నాకున్న 27 మంది నానమ్మల్లో 14 మంది రాజ్ పుత్ లే. అక్బర్ జమానా నుంచి రాజ్ పుత్ లు మొఘలులతో సంబంధాలు పెట్టుకున్నారు. అలాంటి బంధాలను తెంచే ప్రయత్నం చేయొద్ద’ని హితవు చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos