ఉదయ్పూర్: దేశ ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, వృద్ధి రేటు రోజురోజుకూ పడిపోతోందని ఆర్థిక శాఖ మాజీ మంత్రి చిదంబరం విమర్శించారు. ఇక్కడ జరుగు తున్న కాంగ్రెస్ పార్టీ చింతన శిబిరంలో ఆయన శనివారం ప్రసంగించారు.‘ద్రవ్యోల్బణం ఎన్నడూ ఊహించని స్థాయికి చేరుకుంది. పెట్రోల్, డీజిల్ పన్నులు కూడా ద్రవ్యో ల్బణం పెరుగుదలకు కారణాలు భారత ఆర్థిక వ్యవస్థ దిగజారడానికి కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తోన్న విదేశీ వ్యవహారాలు కూడా ఓ కారణం. ద్రవ్యోల్బణం పెరిగిపోతున్న ప్పటికీ దాన్ని కేంద్ర సర్కారు కట్టడి చేయలేకపోతోంద’ని విమర్శించారు.