న్యూ ఢిల్లీ: ఆహార ధాన్యాల ధరలకు సామాన్యులు సతమతం అవుతుం డడంతో కేంద్రం గోధుమ ఎగుమతులను నిషేధించింది. శుక్రవారం రాత్రి ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఎగుమతి కోసం లెటర్స్ ఆఫ్ క్రెడిట్ పొందిన వారికి మాత్రం అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. ఉక్రెయిన్ పై రష్యా దాడులు మొదలు పెట్టిన తర్వాత ఆ దేశాల నుంచి గోధుమ ఎగుమతులు నిలిచిపోయాయి. దీంతో అంతర్జాతీయంగా కొనుగోలుదారులు భారత గోధుమలపై ఆధారపడటంతో దేశీయంగా గోధుమల ధరలు 14-20 శాతం మేర పెరిగాయి. 14 ఏళ్ల గరిష్ఠానికి ధరలు చేరాయి. ఇథనాల్ తయారీలో గోధుమల వినియోగం ధరల మంటలకు కారణమవుతోంది.