న్యూఢిల్లీ : చివరి బడ్జెట్ వేళ.. ప్రధాని నరేంద్ర మోదీ అత్యంత ఉత్సాహాంగా కనిపించారు. లోక్‌సభలో ఇవాళ కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ బడ్జెట్ చదువుతున్న సమయంలో.. ప్రధాని మోదీ ఆనందంగా కనిపించారు. ప్రభుత్వ స్కీమ్‌లను మంత్రి చదువుతున్న సమయంలో మోదీ పదే పదే బల్లను చరుస్తూ కనిపించారు. చాలా హుషారుగా ఆయన తన ఉత్సాహాన్ని చూపించారు. సభలో ఉన్న బీజేపీ సభ్యులతో సమానంగా మోదీ తనలో ఉన్న ఆనందాన్ని ప్రదర్శించారు. ప్రతిపక్షాల వైపు మంత్రి గోయల్ చూస్తున్న సమయంలోనూ మోదీ తన సంతోష సంకేతాలను వ్యక్తపరిచారు.