కోర్టు ధిక్కరణ కేసులు కూడా పెరిగిపోతున్నాయి

కోర్టు ధిక్కరణ కేసులు కూడా పెరిగిపోతున్నాయి

న్యూ ఢిల్లీ: : ‘కోర్టుల ఆదేశాలను కొన్ని ప్రభుత్వాలు పట్టించు కోవడం లేదు. కోర్టు ధిక్కరణ కేసులు కూడా పెరిగిపోతున్నాయ’ని సుప్రీమ్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ విమర్శించారు. శనివారం ఇక్కడ ప్రసంగించారు. ‘ కేసుల పరిష్కారానికి మరింత సిబ్బంది కావాలి. న్యాయ, ప్రభుత్వ వ్యవస్థలు.. రెండు పరస్పర సహకారంతో సాగాలి. ప్రజలతో ప్రత్యక్షంగా ఎన్నికైన వారిని అందరూ గౌరవించాల్సిందే. చట్టం అందరి విషయంలో సమానంగా ఉంటుంది. వార్డు మెంబర్ నుంచి ఎంపీ వరకూ అందరిని గౌరవించాలి. ప్రజాప్రయోజన వ్యాజ్యాలను కొందరు దుర్వినియోగపరుస్తున్నారు. కోర్టుల్లో మానవ వనరుల కొరత తీరితే కేసుల భారం తగ్గుతుంది. న్యాయవ్యవస్థలోని ఖాళీలను ఎప్పటికప్పుడూ భర్తీ చేయాలి. ఏడాది కాలంగా జడ్జిల నియామకాల్లో ప్రభుత్వం పూర్తిగా సహకరించింది. 10 లక్షల మంది జనాభాకు 20 మంది జడ్జిలు మాత్రమే ఉన్నారు. కింది కోర్టుల్లో మాతృభాషలోనే తీర్పులు వెలువరించాల్సిన అవసరముంది. సీఎంలు, హైకోర్టు సీజేలు పరస్పర సహకారంతో పని చేయాలి’’ అని పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos