కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు..

కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు..

ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం కుప్పకూలాయి. ఐటీ, టెక్, బ్యాంకింగ్ స్టాకులపై తీవ్రమైన అమ్మకాల ఒత్తిడి ఇందుకు కారణం. ఉక్రెయిన్ పై రష్యా దాడి, ద్రవ్యోల్బణం వృద్ధి మదుపర్ల నమ్మకాల్ని దెబ్బ తీశాయి. సెన్సెక్స్ 1,172 పాయింట్లు నష్టపోయి 57,166 కి, నిఫ్టీ 302 పాయింట్లు కోల్పోయి 17,173కి దిగజారాయి. ఐటీ, టెక్ సూచీలు 4 శాతానికి పైగా నష్టపోయాయి. బీఎస్ఈ సెన్సెక్స్  లో ఎన్టీపీసీ (6.11%), టాటా స్టీల్ (1.51%), మారుతి (1.37%), టైటాన్ (1.21%), హిందుస్థాన్ యూనిలీవర్ (1.13%). లాభాల్ని గడించాయి. ఇన్ఫోసిస్ (-7.27%), హెచ్డీఎఫ్సీ (-4.81%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-4.74%), టెక్ మహీంద్రా (-4.69%), విప్రో (-3.67%) బాగా నష్ట పోయాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos