ముంబై : స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. పదిన్నర గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 1041 పాయింట్లు కోల్పోయి 57,297కి, నిఫ్టీ 245 పాయింట్లు క్షీణించి 17,230 కి పడిపోయాయి. ఎన్టీపీసీ, ఓఎన్జీసీ, టాటా స్టీల్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహీంద్ర, హెచ్డీఎఫ్సీ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.