ముంబై: థానె పట్టణంలో గురువారం తే నీరు, అల్పాహారం ఇవ్వలేదని ఆగ్రహించిన కాశీనాథ్ పాండురంగ్ పాటిల్ (76) అనే వ్యక్తి తన కోడలును తుపాకితో కాల్చాడు. కోడలి పొట్ట లోకి తూటా దూసుకెళ్లింది. కళ్లముందే ఘోరం జరగడంతో నిశ్చేష్టులైన కుటుంబ సభ్యులు గాయాలపాలైన ఆ మహిళను హుటాహుటిన ఆస్పత్రికి తరలిం చారు. ప్రస్తుతం బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. తోడి కోడలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడు కాశీనాథ్పై కేసు నమోదు చేశామని థానే సీనియర్ పోలీస్ అధికారి సంతోష్ ఘటేకర్ తెలిపారు. ఘటనకు మరేదైన కారణం ఉందా అనే కోణంలో కూడా విచారణ జరుపుతున్నామని వెల్లడించారు.