ముంబై ఇండియన్స్ కథ కంచికేనా…

  • In Sports
  • April 14, 2022
  • 131 Views
ముంబై ఇండియన్స్ కథ కంచికేనా…

ఐపీఎల్ చరిత్రలో తిరుగులేని జట్టుగా నిలిచిన ముంబై ఇండియన్స్.. ఐపీఎల్ 15వ సీజన్‌లో ఘోరంగా విఫలమైంది. ఈ ఏడాది సీజన్‌లో ముంబై బోణి కొట్టలేదు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచుల్లో ఓటమి చెంది పాయింట్ల పట్టికలో అఖరి స్థానంలో నిలిచింది. ముంబై బ్యాటింగ్ పరంగా రాణిస్తున్నప్పటికీ.. బౌలర్లు ఏ మాత్రం ప్రభావం చూపడంలేదు.
ఇక ప్రస్తుత పరిణామాల దృష్ట్యా ఐపీఎల్-2022లో ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తుందా అన్న ప్రశ్న అందరిలో నెలకొంది. కాగా ఐపీఎల్-2014లో కూడా వరుసగా ఐదు మ్యాచుల్లో ఓటమి చెందిన ముంబై … పడి లేచిన కెరటంలా వరుస విజయాలు సాధించి ప్లేఆఫ్స్‌కు చేరుకుంది.. అయితే ఈ సారి కూడా అదే రిపీట్ అవుతుందని కొంత మంది అభిప్రాయపడుతుండగా… మరి కొంత మంది ముంబై పని అయిపోయింది అని కామెంట్లు చేస్తున్నారు.
ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాలంటే..
ముంబై ఇండియన్స్ ఈ సీజన్లో మరో 9 లీగ్ మ్యాచులు ఆడనుంది. వీటిలో 8 మ్యాచుల్లో విజయం సాధిస్తానే ముంబై ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుంది. మరో ఓటమి చవిచూస్తే..  ప్లేఆఫ్ అవకాశాలు సంక్లిష్టం అవుతాయి. ఇక పాయింట్ల పట్టికలో రాజస్తాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ , లక్నో సూపర్ జెయింట్స్ మొదటి 4 స్థానాల్లో నిలిచాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos