అమరావతి : రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏప్రిల్ 4 ఉదయం 9:05 నుంచి 9:45 మధ్య ఆరంభం కానున్నాయి. వాలంటీర్లను ఏప్రిల్ 6న ప్రభుత్వం సత్కారించి ఏప్రిల్ 8న వసతి దీవెన కార్యక్రమాలను ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించనున్నారు. కొత్త జిల్లాలపై అందిన ఫిర్యాదులు, సూచనలు, సలహాలపై ఆయన చర్చించారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై గురు, శుక్రవారాల్లో తుది ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తోంది. అప్పటికల్లా ఏర్పాట్లు పూర్తి చేసేలా అధికారులు శ్రమిస్తున్నారు. బాపట్ల కేంద్రంగా ఏర్పాటయ్యే జిల్లా కోసం ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని 6 నియోజకవర్గాలతో కొత్త జిల్లా ఏర్పాటు కానుంది. మానవవనరుల అభివృద్ధి కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నారు. కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలతో పాటు మరికొన్ని ప్రధాన శాఖల కార్యాలయాల కోసం భవనాలు ముస్తాబవుతున్నాయి.