హైదరాబాదు : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో జాతీయ గ్రామీణ ఉపాధి పథకం (నరేగా) కూలి రేట్లు పెరిగాయి. ప్రస్తుతం రోజు కూలి రూ. 245లు. కేంద్ర ప్రభుత్వం మరో రూ. 12 మంజూరు చేసింది. కేరళలో రూ. 311, కర్ణాటకలో రూ. 309, తమిళనాడు, పుదుచ్చేరిలో రూ. 281 చొప్పున రోజువారి ఉపాధి కూలి చెల్లిస్తున్నారు.