ఉగాది నుంచి కొత్త జిల్లాల ప్రారంభం

ఉగాది నుంచి కొత్త జిల్లాల ప్రారంభం

అమరావతి: ఉగాది పర్వదినాన ముఖ్యమంత్రి జగన్ 13 కొత్త జిల్లాల్లో పరిపాలనను ప్రారంభించనున్నారు. కొత్త జిల్లాలపై అందిన అభ్యంతరాలు, సూచనలు, సలహాల ప్రకారం వారం రోజుల్లో తుది ప్రకటనను మార్చి 31న విడుదలకు సన్నాహాలు చేస్తోంది.  ప్రభుత్వానికి కొన్ని వందల అభ్యంతరాలు అందినట్టు తెలుస్తోంది. అభ్యంతరాలు వ్యక్తం చేసినవారిలో వైసీపీ నేతలు కూడా ఉన్నారు. ఇప్పటికే ఆయా జిల్లాల పరిధిపై స్పష్టమైన రూపు వచ్చినట్టు సమాచారం. ప్రస్తుతం పోలీసు,  రెవెన్యూ ఉద్యోగుల విభజన ప్రక్రియ జరుగుతోంది. కొత్త జిల్లాలకు తొలుత  కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఎస్పీలను నియమించనుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos