2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర మధ్యంతర బడ్జెట్‌ను పీయూష్ గోయల్ శుక్రవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారరు. తన బడ్జెజ్ ప్రసంగంలో ఎక్కడా విశాఖ రైల్వేజోన్ గురించి మాట్లాడలేదు. అలాగే కడప ఉక్కు ఫ్యాక్టరీకి కూడా ఎలాంటి కేటాయింపులు జరపలేదు. కనీసం ఈ బడ్జెట్‌లోనైనా ఆంధ్రప్రదేశ్‌కు రాయితీలు, రైల్వేజోన్ వచ్చే అవకాశం ఉందంటూ.. రెండు మూడు రోజులుగా కొందరు బీజేపీ నేతలు హడావుడి చేశారు. ఇప్పుదంతా వట్టిదేనని తేలిపోయింది. ఈ బడ్జెట్‌లో కూడా తెలుగు రాష్ట్రాలకు మళ్లీ నిరాసే ఎదురైంది. ముఖ్యమైన ప్రాజెక్టులకు ఎలాంటి కేటాయింపులు కనిపించలేదు. ఏపీకి మరోసారి మోదీ తీవ్ర అన్యాయం చేశారు.