కొద్దిరోజుల క్రితం వైసీపీ పార్టీలో చేరిన కదిరి మాజీ సీఐ గోరంట్ల మాధవ్‌కు పార్టీలో కీలకబాధ్యతలు అప్పగిస్తూ వైసీపీ పార్టీ ప్రకటన విడుదల చేసింది.గోరంట్ల మాధవ్‌ను హిందూపురం నియోజకవర్గం సమన్వయకర్తగా నియమిస్తూ వైసీపీ పార్టీ ప్రకటన విడుదల చేసింది.కొద్ది కాలం క్రితం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డికి వ్యతిరేకంగా మీసం మెలేస్తూ దివాకర్‌రెడ్డిని హెచ్చరించి గోరంట్ల మాధవ్ రాష్ట్రవ్యాప్తంగా సంచలన గుర్తింపు పొందిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం వైసీపీ అధినేత జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన గోరంట్ల మాధవ్ హిందూపురం నుంచి టికెట్ ఆశించినట్లు వార్తలు వినిపించాయి.తాజాగా హిందూపురం నియోజకవర్గ సమన్వయకర్తగా గోరంట్ల మాధవ్‌ను నియమిస్తూ వైసీపీ నిర్ణయం తీసుకోవడంతో గోరంట్ల మాధవ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు..
