పడిపోయిన రూపాయి

  • In Money
  • February 1, 2019
  • 941 Views
పడిపోయిన రూపాయి

ముంబయి: బడ్జెట్‌ ప్రవేశపెట్టడానికి కొద్దిసేపటి ముందు రూపాయి విలువ  పతనమైంది. శుక్రవారం ఉదయం ట్రేడింగ్‌ ఆరంభమయ్యాక  నిలకడగా ఉన్న రూపాయి విలువ ఆ తర్వాత 9 పైసలు పతనమైంది. దీంతో డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ రూ.71.17కు చేరింది. మధ్యంతర బడ్జెట్‌ ప్రవేశపెట్టనుండటం, ముడి చమురు ధరలు పెరగడం వంటివి ప్రధాన కారణాలుగా నిలిచాయి. బడ్జెట్‌లో భారీ పథకాలను ప్రభుత్వం ప్రకటిస్తుందనే అంచనాలతో రూపాయి బలహీనపడింది.గురవారం రూపాయి డాలర్‌తో పోలిస్తే 4పైసలు బలపడి రూ.71.08 వద్ద ముగిసింది. గురువారం మార్కెట్లలో ఎఫ్‌ఐఐలు భారీ ఎత్తున కొనుగోళ్లు జరిపారు. రూ.3వేల కోట్లకు పైగా విదేశీ పెట్టుబడిదారులు కొనుగోళ్లు జరిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos