న్యూ ఢిల్లీ: వంట ఇంధనం వాణిజ్య సిలిండర్ ధర మంగళ వారం నుంచి పెరిగింది. 19 కేజీల సిలిండర్ ధరపై రూ. 105లు , 5 కేజీల సిలిండర్పై రూ. 27 వంతున ధర పెంచాయి. దేశ రాజధానిలో కమర్షియల్ సిలిండర్ ధర రెండు వేలు దాటింది. 19 కేజీ సిలిండర్ ధర రూ. 2,012కి చేరగా 5 కేజీల సిలిండర్ ధర రూ. 569గా ఉంది. చెన్నైలో రూ. 2185, ముంబై రూ.1962 , కోల్కతా రూ.2089లు, హైదరాబాద్లో రూ.1904లు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతుండటంతో గృహ అవసరాలకు ఉపయోగించే సిలిండర్ ధరలు పెంచే సాహాసం చమురు కంపెనీలు చేయలేదు. దీంతో వీటి ధరల్లో ఎటువంటి మార్పులేదు.