రష్యాకు తోడుగా బెలారస్‌

రష్యాకు తోడుగా బెలారస్‌

కియోవ్ : ఉక్రెయిన్పై దండ యాత్ర చేస్తున్న రష్యా బలగాలతో బెలారస్ సైన్యం చేరే అవకాశముందని అమెరికా నిఘా అధికారులు వెల్లడించారు. రష్యా, ఉక్రెయిన్ చర్చల ఫలితాలను బట్టి బెలారస్ నిర్ణయం ఉంటుంది. రష్యా దళాలను ఉక్రెయిన్ బలగాలు తీవ్రంగా ప్రతిఘటి స్తున్నందున పుతిన్ ఊహించిన దానికి విరుద్ధంగా దండయాత్ర నెమ్మదిగా సాగుతోందన్నారు. రష్యా దాడుల్లో ఇప్పటివరకు 352 ఉక్రెయిన్ పౌరులు మృతి చెందినట్లు ఆ దేశ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి వెల్లడించారు. వీరిలో 14మంది చిన్నారులు ఉన్నారని తెలిపారు. 116 మంది చిన్నారులు సహా మొత్తం 1,684 మంది గాయపడ్డారని వివరించారు. ఉక్రెయిన్ సైన్యం మృతుల వివరాల్ని తెలుపలేదు. కీవ్లోని రేడియోధార్మిక వ్యర్థాల నిర్వహణ కేంద్రంపై రష్యా క్షిపణి దాడులు చేసిందని అంతర్జాతీయ అణు శక్తి సంస్థకు ఉక్రెయిన్ తెలిపింది. సంబంధిత వివరాల్ని వెల్లడించ లేదు. రష్యాను ఎదుర్కొనేందుకు ఉక్రెయిన్ సైనిక నేపథ్యం కలిగి జైళ్లలో శిక్ష అనుభవిస్తోన్న వారిని, పలు నేరాల్లో అనుమానితులను విడుదల చేస్తోంది. వారు రష్యా పై పోరులో చేరనున్నారు. ఈ విషయాన్ని నేషనల్ ప్రాజిక్యూటర్ జనరల్ కార్యాలయం ధ్రువీకరించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos