శివాజీ గురువు రామ్‌దాస్ కాదు

శివాజీ గురువు రామ్‌దాస్ కాదు

ముంబై: ఛత్రపతి శివాజీ గురువు సమర్థ్ రామ్దాస్గా గవర్నర్ చేసిన పేర్కొనటాన్ని ఎన్సీపీ నేత సుప్రియా సూలే ఆక్షేపించారు. ఛత్రపతి శివాజీ, సమర్థ్ రామ్దాస్ ఎప్పుడూ కలుసుకున్నట్లు ఆధారాలు లేవని, వాళ్లిద్దరి మధ్య ఎలాంటి గురుశిష్యుల బంధం లేదనే విషయాన్ని జూలై 16, 2018న బాంబే హైకోర్టు కూడా స్పష్టం చేసిందని పేర్కొన్నారు. ఔరంగాబాద్లో ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో మహారాష్ట్ర గవర్నర్ భగత్సింగ్ మాట్లాడుతూ.. ‘గురువులు లేకుండా శిష్యులు లేరు. సమర్థ్ రామ్దాస్ (గురువు) లేకుండా ఛత్రపతి శివాజీ లేడు. చాణక్యుడు లేకుండా చంద్రగుప్తుడు లేడు. శివాజీ, చంద్రగుప్తుడు శక్తిమంతులే. వాళ్లు ఎదగడంలో గురువుల పాత్ర కీలకం’ అని వ్యాఖ్యానించాడు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos