లడన్ : రష్యా,ఉక్రెయిన్ యుద్ధం ఏళ్ల తరబడి కొనసాగే ముప్పు ఉందని బ్రిటన్ విదేశాంగ మంత్రి లిజ్ ట్రస్ తెలిపారు. ‘రష్యా సైన్యం శక్తిమంతంగా ఉంది. ఉక్రెయిన్ పౌరులు ధైర్యవంతులు. సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు ఉక్రెయిన్ ప్రజలు చివరి వరకూ పోరు కొనసాగిస్తారు. యుద్ధం సుదీర్ఘ కాలం కొనసాగుతుందని, రష్యా అధ్యక్షుడు పుతిన్ మరింత శక్తిమంతమైన ఆయుధాలను వాడే ముప్పు ఉంద’ని హెచ్చరించారు.