ఉక్రెయిన్‌ నుంచి భారతీయులను తరలింపునకు నలుగురు మంత్రులు

ఉక్రెయిన్‌ నుంచి భారతీయులను తరలింపునకు నలుగురు మంత్రులు

న్యూ ఢిల్లీ : ఉక్రెయిన్ లో చిక్కకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర మంత్రులు హర్దీప్ సింగ్ పూరి, జ్యోతిరాదిత్య సింధియా, కిరెన్ రిజ్జు, జనరల్ (రిటైర్డ్) వీకే సింగ్ ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు వెళ్లి తరలింపు ప్రక్రియను పర్యవేక్షించనున్నారు. వీరు వరుసగా హంగేరి, రొమేనియా, పోల్యాండ్, స్లొవేకియా దేశాలకు వెళ్తారు. ఉక్రెయిన్ నుంచి పోలాండ్ కు వలసలు ఎక్కువగా ఉంటున్నాయి. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారతీయులపై స్థానిక పోలీసులు దాడి చేసిన వీడియోలు వైరల్ అయ్యాయి. ఉక్రెయిన్లో సుమారు పది హేను వేల మంది దాకా భారతీయులు ఉన్నట్లు కేంద్రం అంచనా.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos