మా ప్రజలు హింసకు గురవుతుంటే అలా వదిలేయ లేం

న్యూ ఢిల్లీ : ఉక్రెయిన్ – పోలాండ్ సరిహద్దు వద్ద ఉన్న గార్డులు భారతీయ విద్యార్థులను హింసకు గురిచేస్తున్నారు. అమ్మాయిలనూ కనికరం కూడా లేకుండా దారుణంగా కొడుతున్నారు. కొంతమంది విద్యార్థులను సరిహద్దుల నుంచి నెట్టివేయడంతో అక్కడ పరిస్థితి చాలా ఉద్రిక్తంగానూ, గందరగోళంగానూ ఉంది. ఈ వీడియోని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఆయన అక్కడ పరిస్థితిపై ఆందోళన చెందారు. దయచేసి ప్రభుత్వం త్వరితగతిన భారతీయ విద్యార్థులను తరలించాలని కోరారు. హింసకు గురువుతున్న భారతీయ విద్యార్థులు వారి కుటుంబాలను చూస్తుంటే హృదయం విలవిలాడిపోతుందని అన్నారు. తరలింపు చర్యలు మరింత ముమ్మ రంగా సాగించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉక్రెయిన్ గగనతలాన్ని మూసివేసి సమాఖ్య ప్రభుత్వం గత వారం హంగరీ, పోలాండ్, రొమేనియ, స్లోవేకియా రిపబ్లిక్ సహాయం తో తరలిస్తోంది. సంబంధిత అధికారుల సమన్వయం లేకుండా సరిహద్దు ప్రాంతాలకు చేరుకోవద్దని ప్రభుత్వం విద్యార్థులకు తెలిపింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos