నెలకు రూ.15వేల కంటే తక్కువ సంపాదించేవారికి గుడ్‌న్యూస్ !

న్యూఢిల్లీ : నరేంద్ర మోదీ ప్రభుత్వ హయాంలో ఉద్యోగుల భవిష్య నిధి చందాదారుల సంఖ్య 2 కోట్లు పెరిగినట్లు ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. గ్రాట్యుయిటీ పరిమితిని రూ.30 లక్షలకు పెంచుతున్నట్లు తెలిపారు. కొత్త పింఛను పథకాన్ని ప్రకటించారు. కనీస పింఛను రూ.3,000 చెల్లించేవిధంగా ఈ పథకాన్ని రూపొందించినట్లు తెలిపారు. నెలకు రూ.15 వేలు కన్నా తక్కువ ఆదాయం సంపాదించేవారికి ఈ పథకం వర్తిస్తుందన్నారు. ఈ పథకం వల్ల 10 కోట్ల మంది ప్రయోజనం పొందుతారన్నారు. దేశంలోని అత్యంత వెనుకబడిన వర్గాలను చేరుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ఈ పథకం కోసం రూ.500 కోట్లు కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. భవన నిర్మాణం, వీథి వ్యాపారులు వంటివారు దీనివల్ల ప్రయోజనం పొందుతారన్నారు

మహిళల అభివృద్ధి నుంచి మహిళల నేతృత్వంలో అభివృద్ధి దిశగా ముందడుగు వేస్తామని బడ్జెట్ ప్రసంగంలో పీయూష్ గోయల్ చెప్పారు. నీతీ ఆయోగ్ ఆధ్వర్యంలోని కమిటీ ఆదివాసీలను గుర్తిస్తుందని తెలిపారు. ఈ వర్గాల కోసం ప్రత్యేక వ్యూహాలను రూపొందిస్తామని చెప్పారు. ఉజ్వల యోజన క్రింద మహిళలకు 6 కోట్ల ఉచిత వంట గ్యాస్ కనెక్షన్లను ఇచ్చామన్నారు. మరో 2 కోట్ల మంది పేదలకు వచ్చే ఏడాది సమకూర్చుతామని చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos