కేసీఆర్‌పై పీఎస్‌లలో ఫిర్యాదులు

భారత రాజ్యాంగం విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. రేపు అన్ని పోలీస్ స్టేషన్లలో సీఎం కేసీఆర్‌పై ఫిర్యాదు చేయనున్నట్టు టి.పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి వెల్లడించారు. కేసీఆర్ మాటల వెనక కుట్ర ఉందన్న ఆయన.. నరేంద్ర మోడీ ఆదర్శ నాయకుడు పుతిన్ అయితే.. కేసీఆర్ కి ఆదర్శం ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ అంటూ ఎద్దేవా చేశారు. ఇద్దరి ఆలోచన నియంత పోకడ, రాచరిక పెత్తనం అని.. ఇలాంటి ఆలోచనలు తిప్పి కొట్టాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.
ఎల్లుండి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పాలాభిషేకం చేస్తాం అన్నారు. అంబేద్కర్ విగ్రహాలకు మహిళా నాయకులే పాలాభిషేకం చేయాలని సూచించిన ఆయన..  సోమవారం.. పార్లమెంట్‌లో దీక్ష చేయనున్నట్టు ప్రకటించారు.. కేసీఆర్ వ్యవహారంపై రాహుల్, సోనియా గాంధీతో మాట్లాడతాం.. భవిష్యత్ కార్యాచరణను పీఏసీలో చర్చిస్తాం అన్నారు. ఎనిమిదేళ్లు ఎన్నో అరాచకాలు చేసిన కేసీఆర్‌ను రాళ్లతో కొట్టేవాళ్లం.. ఆటవిక రాజ్యం కావాలని అనుకుంటే… మొదట శిక్షించేది నిన్నే అంటూ కేసీఆర్‌ను హెచ్చరించారు రేవంత్ రెడ్డి.. రాజ్యాంగం మీద గౌరవం ఉంది కాబట్టే నిన్ను ఏం అనట్టేదన్న ఆయన.. నీకు రాజ్యాంగం ఇష్టం లేకపోతే . .అడవిలోకి పో అంటూ సలహా ఇచ్చారు.. వెంటనే కేసీఆర్ మాటలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసిన రేవంత్‌ రెడ్డి.. లేదంటే బడిత పూజ తప్పదు అంటూ హెచ్చరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos