టీమిండియాతో జాగ్రత్తగా ఉంటాం…

  • In Sports
  • December 25, 2021
  • 130 Views
టీమిండియాతో జాగ్రత్తగా ఉంటాం…

టీమిండియా, దక్షిణాఫ్రికా మధ్య ఆదివారం నుంచి టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. సెంచూరియన్ వేదికగా ఈ రెండు జట్ల మధ్య తొలి టెస్ట్ జరగనుంది. ఈ సందర్భంగా సౌతాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గార్ మాట్లాడుతూ… పేపర్ మీద టీమిండియా జట్టు బలంగా కనిపిస్తున్నా గెలుపు మాత్రం తమదే అని ధీమా వ్యక్తం చేశాడు. హోం గ్రౌండ్‌లో  పరిస్థితులు తమకే అనుకూలంగా ఉంటాయని ఎల్గార్ తెలిపాడు. అయితే ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలలో టీమిండియా మంచి ఆటతీరును కనిపరిచిందని.. అందుకే తాము జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నాడు.
దక్షిణాఫ్రికాలోని పిచ్‌లపై టీమిండియా పేసర్లు కూడా రాణించగలుగుతారని… తమ బౌలర్లు కూడా అదనపు బౌన్స్, స్వింగ్ రాబట్టి మంచి ఫలితం సాధిస్తారన్న నమ్మకం ఉందని ఎల్గార్ వెల్లడించాడు. పుజారా, కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్‌లో భారత్ బ్యాటింగ్ లైనప్ బలంగానే ఉందని.. కానీ తమ బౌలర్లు వారికి కళ్లెం వేస్తారని పేర్కొన్నాడు. టీమిండియా ఇప్పటివరకు సౌతాఫ్రికాలో ఏడు సార్లు పర్యటించినా టెస్ట్ సిరీస్ గెలవలేదని… ఇప్పుడు కూడా తామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేశాడు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos