న్యూ ఢిల్లీ: విపక్షాల ఆందోళనలు లోక్సభలోనూ కొనసాగాయి. లఖింపుర్ ఖేరీ ఘటనపై చర్చించాలని విపక్ష సభ్యులు సభ మధ్య భాగంలోకి వెళ్లటంతో సభాపతి ఓం బిర్లా సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేసారు. .రాజ్యసభ సమావేశాలకు మళ్లీ ఆటంకం కలిగింది. 12 మంది ఎంపీల సస్పెన్షన్పై విపక్షాల నినాదాల నడుమ ఎగువ సభ మధ్యాహ్నం వాయిదా పడింది. లోక్సభలో లఖింపుర్ ఖేరీ ఘటనపై కాంగ్రెస్ పార్టీ చర్చకు పట్టుపట్టింది. ఇందుకోసం వాయిదా తీర్మానం నోటీసులు ఇచ్చారు. లఖింపుర్లో ఘటన ప్రమాదం కాదని, ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరిగిందని ఇప్పటికే ప్రత్యేక విచారణ బృందం సిట్ నివేదిక ఇచ్చింది.