చంద్రబాబు హుద్‌హుద్‌ తుపాన్‌ లాంటి వారు

చంద్రబాబు హుద్‌హుద్‌ తుపాన్‌ లాంటి వారు

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు పార్లమెంటు సాక్షిగా మరోసారి నిరసన గళమెత్తారు. పార్లమెంట్‌ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద పార్టీ ఎంపీలు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి  ఏపీకి ప్రత్యేక హోదా, విభజన చట్టంలో పేర్కొన్న హామీలను నెరవేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఏపీకి ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కేంద్రానికి ఇదే చివరి అవకాశమని అన్నారు. నాలుగేళ్లపాటు బీజేపీతో అధికారాన్ని పంచుకున్న చంద్రబాబు.. రాష్ట్రానికి అన్యాయం జరగడానికి ప్రధాన కారకుడని ఆగ్రహం వ్యక్తం చేశారు.చంద్రబాబు హుద్‌హుద్‌ తుపాన్‌ లాంటి వారు.. తుపాన్‌ కంటే ఎక్కువగా రాష్ట్రాన్ని ప్రతిరోజూ నాశనం చేస్తున్నారు. అప్పులు తీసుకొచ్చి ధర్మ పోరాట దీక్షల పేరుతో అధర్మ పోరాటాలు చేస్తున్నారు. నిధులను దుర్వినియోగం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని తప్పక గెలిపిస్తారు’ అని వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి మీడియాతో చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos