స్పైడర్‌మ్యాన్.. బ్యాంకు ఉద్యోగి

స్పైడర్‌మ్యాన్.. బ్యాంకు ఉద్యోగి

స్పైడర్ మ్యాన్ బ్యాంకు ఉద్యోగి ఏంటా అనుకుంటున్నారా? తన చివరి పని దినం చిరకాలం గుర్తుండిపోయేందుకు గాను బ్రెజిల్‌కు చెందిన ఓ బ్యాంకు ఉద్యోగి ఇలా స్పైడర్‌మ్యాన్ వేషధారణలో విధులకు హాజరై సహోదోగ్యులను ఆశ్చర్యంలో ముంచెత్తాడు. సహచరులతో మాట్లాడుతూ, కంప్యూటర్ ముందు కూర్చొని పనిచేస్తున్న అతడి చిత్రాలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఆయన చివరి పనిదినం రోజున ఆయనతో పాటు ఇతర ఉద్యోగులు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నట్లు అందులో కనిపిస్తున్నది. ఓ వీడియోను యూట్యూబ్‌లోనూ పోస్ట్ చేశారు. సామాజిక మాధ్యమం ఇమ్‌గర్‌లో ఆయన ఫొటోలకు 1.2 లక్షల వ్యూస్ రాగా, వీడియోకు 2.4 లక్షల వ్యూస్ వచ్చాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos