విజయసాయిరెడ్డి ముందే ఓడిపోతామని తేల్చి చెప్పిన వైసీపీ నేత!

విజయసాయిరెడ్డి ముందే ఓడిపోతామని తేల్చి చెప్పిన వైసీపీ నేత!

వైసీపీ కొండపి నియోజకవర్గ మాజీ సమన్వయకర్త వరికూటి అశోక్‌బాబుకు ఎమ్మెల్యే అభ్యర్థి సీటు ఇవ్వబోమని పార్టీ అధిష్ఠానం స్పష్టం చేసింది. అశోక్‌బాబుతో పాటు నియోజకవర్గంలోని ఆరు మండలాలకు చెందిన 20 మంది నాయకులు వైసీపీ అధిష్ఠానాన్ని కలిసేందుకు ఆదివారం హైద రాబాద్‌ వెళ్లారు. ఎట్టకేలకు సోమవారం రాజ్యసభ సభ్యుడు, వైసీపీ రాష్ట్ర ముఖ్య నాయకుడు విజయసాయిరెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ వరికూటి సోదరులు పార్టీ అభ్యర్థుల విజయానికి పనిచేస్తే, ప్రభుత్వం వచ్చాక ఎవరో ఒకరికి ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. నాలుగేళ్లు కష్టపడింది, ఎమ్మెల్సీ కోసం కాదని కొండపి ఎమ్మెల్యే సీటు ఇవ్వాలని నాయకులు విజయసాయిని కోరగా.. పార్టీ కోసం పనిచేయండి, అందుకు అంగీకారమైతేనే అధినేత జగన్‌తో మాట్లాడిస్తానని విజయసాయి స్పష్టం చేశారు. దీంతో అసంతృప్తి చెందిన ఓ నాయకుడు ఇలాగైతే కొండపి ఎమ్మెల్యే సీటు, ఒంగోలు ఎంపీ సీటు రెండింటిలో పార్టీ నిలిపే అభ్యర్థులు ఓడిపోతారని విజయసాయితో నిర్మొహమాటంగా అన్నట్టు తెలిసింది. స్పందించిన విజయసాయి బెదిరిస్తున్నారా? అనగా కొండపి నాయకుడు లేదు సార్‌.. భవిష్యత్‌లో జరిగేది ముందుగానే మీకు చెబుతున్నామని వివరించబోగా, మీ ఇష్టం.. నిర్ణయం మీదే అని విజయసాయి రెడ్డి ముక్తాయించారని తెలిసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos