న్యూ ఢిల్లీ: గాంధీ జయంతి పర్వ దినాన కొందరు గాంధీ విమర్శకులు ట్విట్టర్ లో గాడ్సే జిందాబాద్ అంటూ పోస్టులు పెడుతున్నారు. కొన్ని వేల మంది దాన్ని వైరల్ చేస్తున్నారు. ఇదుకు బీజేపీ లోక్సభ సభ్యుడు వరుణ్ గాంధీ తీవ్రంగా స్పందించారు. దేశం పరువు తీస్తున్నారని మండిపడ్డారు.‘‘ప్రపంచానికి భారత్ ఎప్పటికీ ఆధ్యాత్మిక గురువు. కానీ, దానికి కారణం మహాత్మా గాంధీనే అన్న విషయాన్ని మరచిపోవద్దు. తన బోధనల ద్వారా ప్రపంచానికి ఆధ్యాత్మికతను పరిచయం చేశారు. అందువల్లే ఇప్పటికీ మనం ఆధ్యాత్మికతలో గొప్ప శక్తిగా ఉన్నాం. కానీ, గాడ్సే జిందాబాద్ అంటూ చాలా మంది మన దేశం పరువు తీస్తున్నారు’’ అని ఆయన ట్వీట్ చేశారు. గాంధీని స్వాతంత్ర్యం వచ్చాక 1948 జనవరి 30న నాథూరాం గాడ్సే కాల్చి చంపాడు.