న్యూ ఢిల్లీ : నగరంలో శుక్రవారం ప్రార్థనా మందిరాలు తెరుచుకున్నాయి. సందర్శకులందరూ తప్పని సరిగా కరోనా నిబంధనలు పాటించాలని ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. పండుగల సీజన్ కావడంతో కఠిన చర్యలను తీసు కోవాలని జిల్లా కలెక్టర్లకు, డిప్యూటీ పోలీస్ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేసింది. మేళాలు, ఆహార అంగళ్లు, ఊరేగిం పు లకు, బహిరంగ ప్రదేశాల్లో ఛాత్ పూజల్ని నిషేధించారు. వేడుకలను ఇళ్లలోనే నిర్వహిం చుకోవాలి. అక్టోబర్ 15 అర్ధరాత్రి వరకూ ఆంక్షలు ఉంటాయి.