హైదరాబాదు :ఇక్కడి యల్లారెడ్డిగూడలోని పోసాని మురళి కృష్ణ నివాసంపై బుధవారం అర్ధ రాత్రి దాటిన తర్వాత గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు, ఇటుకలు రువ్వారు. ఏడు, ఎనిమిది మంది వరకు దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. పోసానికి వ్యతిరేకంగా యువకులు నినాదాలు చేశారు. పవన్ కల్యాణ్ జిందాబాద్ అంటూ నినదించినట్టు కూడా తెలుస్తోంది. భయభ్రాంతులకు గురైన కాపలాదారు ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలిస్తున్నారు.
పోసాని ఎనిమిది నెలల కిందట యల్లారెడ్డిగూడలోని ఇంటి నుంచి గచ్చిబౌలికి మారారు. యల్లారెడ్డిగూడలోని ఇంట్లో పోసాని ఉన్నారనే భావనతో దాడి జరిగి ఉంటుందని పోలీసుల అనుమానం.