ఉక్కు దారులన్నీ దిగ్బంధనం

ఉక్కు దారులన్నీ దిగ్బంధనం

విశాఖ : స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ట్రాన్సాక్షన్, లీగల్ అడ్వైజరీ నియామకం కోసం ప్రజెంటేషన్ చేయడానికి ఐదు కంపెనీలకు అనుమతినిచ్చినందున గురువారం కార్మికు లంతా ఏకమై అన్ని దారులను దిగ్బంధనం చేశారు. లీగల్ ట్రాన్సక్షన్ అడ్వైజర్ నియామకాల కోసం బిడ్లను ఆహ్వానించిన స్టీల్ ప్లాంట్ యాజమాన్యం. శుక్రవారం ఆయా కంపెనీలతో ప్రజెంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించాలని తలపెట్టింది. ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవడం కోసం కార్మికులంతా ఐక్యంగా స్టీల్ ప్లాంట్ లోపలికి వెళ్ళడానికి ప్రధాన ద్వారాలను దిగ్బంధనం చేశారు. మెయిన్ గేటు, లేబర్ గేటు, బిసి గేటు, అడ్మిన్ బిల్డింగ్, ప్రాజెక్టు గేట్లు, పవర్ గేట్, రెండో లేబర్ గేట్ల వద్ద కార్మికులు భారీ ఎత్తున మోహ రిం చారు. మెయిన్ గేట్ వద్ద అఖిలపక్ష కార్మిక సంఘాలు సమావేశం ఏర్పాటు చేశాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos