చెన్నై: దళిత నటీనటులు, దర్శకుల వల్ల తనకు సినీ అవకాశాలు దెబ్బ తిన్నందున వారిని పరిశ్రమ నుంచి తరిమికొట్టాలని ఆరోపించిన మీరా మిథున్కు బెయిల్ ఇచ్చేందుకు చెన్నై ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు మంగళవారం నిరాకరించింది. ఆమెకు వ్యతిరేకంగా వీసీకే పార్టీ నేత వన్నియరసు ఇక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేసిన వెంటనే ఆమె కేరళకు వెళ్లిపోయింది. ఆమె ఆచూకీని తెలుసుకున్న పోలీసులు కేరళకు వెళ్లి , అరెస్ట్ చేసి తీసుకొచ్చారు.