ముంబై: అఫ్గనిస్తాన్ తాలిబన్ల ఆక్రమణ వల్ల తన నిశ్చితార్థం కూడా రద్దయిందని నటి అర్షి ఖాన్ తెలిపారు. ’ వచ్చే అక్టోబర్లో అఫ్గనిస్తాన్ క్రికెటర్తో నా నిశ్చితార్థం జరగాల్సి ఉండే. తాలిబన్లు.. అఫ్గన్ను ఆక్రమించడంతో అది కాస్త రద్దయ్యింద’ని వివరించారు. ఇటీవల ఆంగ్ల మీడియా ముఖాముఖిలో అర్షి ఖాన్ పెళ్లి గురించి పేర్కొన్నారు. ‘ఓ అఫ్గనిస్తాన్ క్రికెటర్తో వచ్చే అక్టోబర్లో నా నిశ్చితార్థం జరగాల్సి ఉండే. అబ్బాయిని మా నాన్నఎంపిక చేశారు. తను మా నాన్న స్నేహితుడి కుమారుడు. నిశ్చితార్థం రద్దు అయినా మేం మంచి మిత్రులుగానే ఉన్నాం. ఈ నిర్ణయం పట్ల ఎంతో సంతోషంగా ఉన్నాం. ఇప్పుడు నాకనిపిస్తుంది. నా జీవిత భాగస్వామి తప్పకుండా భారతీయ వ్యక్తే అయి ఉంటాడు’’ అని తెలిపారు. ‘నేను అఫ్గనిస్తాన్ యూసుఫ్ జహీర్ పఠాన్ జాతికి చెందిన వ్యక్తిని నా తాత అఫ్ఘనిస్తాన్ నుంచి వలస వచ్చారు.. భోపాల్లో జైలర్గా ఉన్నారు. నా మూలాలు అఫ్ఘనిస్తాన్లో ఉన్నాయి. అయినా నేను భారతీయ పౌరురాలినే. నా 4వ ఏట అర్షి ఖాన్ తల్లి దండ్రులు అఫ్గన్ నుంచి ఇండియాకు వలస వచ్చారు’అని వివరించారు.