కాబూల్ : తాలిబన్లకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పంజ్షీర్ లోయ ప్రజలు, సైన్యం వారికి ఏ మాత్రం భయపడడం లేదు. తాలిబన్లకు లొంగే ప్రసక్తే లేదని తెగేసి చెప్పారు. పంజ్షీ ర్ కు వెళ్లే మార్గాల్లో ప్రజలు కూడా పహారా కాస్తుండటంతో వారి ధైర్యం ప్రపంచ దృష్టినీ ఆకర్షించింది. ఇప్పుడు తాలిబన్లు పంజ్షీర్ వైపునకు పెద్ద ఎత్తున ఆయుధాలతో బయలు దేరటంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పంజ్షీర్ లోయ ఆక్రమణకు తాలిబన్లు ప్రయత్నాలు జరపడంతో వారి చర్యలను సైన్యం, ప్రజలు తిప్పికొట్టారు. దాదాపు 300 మంది తాలిబన్లను మట్టుబెట్టినట్లు పంజ్షీర్ సైన్యం ప్రకటన చేసింది.