నెల్లూరు: లోక్సభ సభ్యుడు ఆదాల ప్రభాకర్ రెడ్డికి ఆయన నివాసంలో బారా షహీద్ దర్గా గంధాన్ని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోమవారం సమర్పించారు. గంధాన్ని తిలకంగా దిద్దారు. విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డికీ గంధాన్ని సమర్పించారు. ఆయనతో పాటు నుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, ఏఎంజి చైర్మన్ ఏసు నాయుడు, అబూబకర్ తదితరులు ఉన్నారు.