న్యూ ఢిల్లీ : సెప్టెంబరులో ప్రతిరోజూ 4 నుంచి 5 లక్షల మంది కరోనాకు గురయ్యే ప్రమాదం ఉందని నీతి ఆయోగ్ హెచ్చరించింది. కరోనా బారిన పడిన వారిలో 23 శాతం మంది ఆసుపత్రిలో చేరాల్సి ఉంటుందని తెలిపింది. ముందుగా దేశంలో రెండు లక్షల ఐసీయూ పడకల్ని, వైద్య సదుపాయాలు, 1.2 లక్షల వెంటిలేటర్ కలిగిన ఐసీయూ, 7 లక్షల ఆక్సిజన్ సిలిండర్లు కలిగిన, 10 లక్షల కోవిడ్ ఐసోలేషన్ కేర్ పడకల్ని సిద్ధం చేయాలని సూచించింది. 2020 సెప్టెంబరులో కరోనా రెండో దాడి గురించి నీతి ఆయోగ్ హెచ్చరించింది. దేశంలో గత 56 రోజులుగా 50 వేల కంటే తక్కువగా రోజువారీ కరోనా కేసులు నమోదవుతున్నాయి.