హైదరాబాద్ : పరిటాల రవి చిన్న కుమారుడు పరిటాల సిద్దార్థ్ మరింత చిక్కుల్లో కూరుకుపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. శంషాబాద్ విమానాశ్రయంలో తూటా తో పట్టుబడిన ఆయనకు పోలీసులు సంజాయిషీ తాఖీదు ఇచ్చారు. సిద్ధార్థ్ కు పాయింట్ 32 క్యాలిబర్ తుపాకీకి లైసెన్స్ ఉంది. ఆయన సంచిలో లభ్యమైన బుల్లెట్ 5.56 క్యాలిబర్. ఇప్పుడు ఇదే సిద్ధార్థ్ కు ఇబ్బందులు తీసుకురాబోతోంది. సైనికులు ఇన్సాస్ రైఫిల్స్ లో వాటిని వాడతారు. అది సిద్ధార్థ్ కు ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై విచారణ ప్రారంభమైంది. అనంతపురం జిల్లాకు చెందిన ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ జవానుదని చెబుతున్నారు. పరిటాల కుటుంబంతో ఆ వ్యక్తికి పరిచయం ఉన్నట్టు అనుమానిస్తున్నారు.