ఎట్టకేలకు బంగార్రాజు

  • In Film
  • August 20, 2021
  • 137 Views
ఎట్టకేలకు బంగార్రాజు

సోగ్గాడే చిన్నినాయనా’ సినిమా సంచలన విజయాన్ని సాధించిన దగ్గర నుంచి, ‘బంగార్రాజు’ సినిమా గురించిన ప్రస్తావన వస్తూనే ఉంది. ఆ సినిమాలో నాగార్జున పోషించిన ‘బంగార్రాజు’ పాత్రకి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఆయన ఆ పాత్ర పేరుతోనే ఒక సినిమా చేయాలనుకున్నారు. అయితే ఆ టైటిల్ కి తగిన కథను తయారు చేసుకుని నాగార్జునను ఒప్పించడానికి కల్యాణ్ కృష్ణ చాలా సమయమే తీసుకున్నాడు. ఆ తరువాత మరికొన్ని కారణాల వలన ఈ ప్రాజెక్టు ఆలస్యమవుతూ వచ్చింది. ఇప్పటికి ఈ సినిమాకి ముహూర్తం కుదిరింది. శుక్రవారం అన్నపూర్ణ స్టూడియోలో ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. గ్రామీణ నేపథ్యంలో రూపొందే ఈ సినిమాలో నాగార్జున సరసన నాయికగా రమ్యకృష్ణ కనిపించనుంది. ఇక నాగచైతన్య ఒక కీలకమైన పాత్రను పోషించనుండగా, ఆయన సరసన నాయికగా కృతి శెట్టి అలరించనుంది. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు. ‘సంక్రాంతి’ బరిలోనే ఈ సినిమాను దింపాలనే ఆలోచనలో నాగార్జున ఉన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos