పంచకుల : కొత్త వ్యవసాయాల చట్టాల్లో రైతుల ప్రయోజనాల వ్యతిరేక నిబంధన ఉన్నట్లయితే అన్నదాతలతో చర్చలకు తమ ప్రభుత్వం సిద్ధమేనని రక్షణమంత్రి రాజ్నా థ్సింగ్ ప్రకటించారు. శుక్రవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. ‘చట్టాలను పూర్తిగా అవగాహన చేసుకోవాలి. . ప్రతిపక్షాలుకనీస మద్దతు ధరపై గందరగోళం వ్యాప్తికి ప్రయత్నిస్తున్నా యి. దీనిని రైతులు అర్థం చేసుకోవాలి. రైతు సోదరు లకు నష్టం కలిగించే ఒక్క అంశం కూడా అందులో లేదు. ఒకటిన్నర రెట్లు కనీస మద్దతు ధర పెంచిం ద’న్నారు.కొత్త సాగు చట్టాల రద్దు కోసం గతేడాది నవంబరు నుంచి రైతులు దిల్లీ సరిహద్దుల్లో పంజాబ్, హరి యాణా, పశ్చిమ ఉత్తర ప్రదేశ్ రైతులు పెద్దఎత్తున ఆందోళన చేస్తు న్నారు. ‘బడా కార్పొరేట్ శక్తులకు లబ్ధి చేకూర్చేందుకు కేంద్రం ఈ చట్టాలు తీసు కొచ్చింది. వీటివల్ల మండీ, ఎంఎస్పీ సేకరణ వ్యవస్థలు పూర్తిగా కనుమరుగ వుతా య’ని రైతు సంఘాలు ఆరోపించాయి.