కోవిడ్‌ కేసులు స్వల్పంగా పెరిగాయి

న్యూ ఢిల్లీ : దేశంలో నిన్నటితో పోలిస్తే కరోనా కేసుల సంఖ్య 3.4 శాతానికి పెరిగింది. తాజాగా 39,157 మంది బాధితులు కోవిడ్ నుంచి కోలుకున్నారు. మరో 530 మంది మృతి చెందారు. గత 24 గంటల్లో కొత్తగా 36,571 కరోనా కేసులు దాఖలైనట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. మొత్తం దేశంలో కరోనా కేసుల సంఖ్య 3,23,22,258కు పెరిగింది. ఇందులో 3,15,25,080 మంది బాధితులు కోలుకున్నారు. కరోనా కేసులు 150 రోజుల కనిష్ఠానికి చేరుకున్నాయి. ప్రస్తుతం 3,63,605 కేసులున్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos