కశ్మీర్ : పుల్వామా జిల్లా ఖ్రూ ప్రాంతంలో శుక్రవారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రమూకల పట్టివేతకు తనిఖీలు చేసిన భద్రతా దళాల పై ముష్కరులు కాల్పులకు తెగబడినపుడు ఎదురు కాల్పులు సంభవించాయి. ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఘటనాస్థలం నుంచి ఒక ఏకే రైఫిల్, ఒక పిస్టోల్ స్వాధీనం చేసుకున్నట్లు డీజీపీ దిల్బాగ్ సింగ్ తెలిపారు. హత మైన ఉగ్ర వాదుల్లో ఒకరు ముసాయిబ్ ముస్తాక్ . గత జులై 23న పాస్తు నాలోని ప్రభుత్వ పాఠశాల జవాన్ ను హత్యచేశాడని ఐజీపీ విజయ్ కుమార్ తెలిపారు.