cచెన్నై : కేంద్ర విచారణ బృందం (సిబిఐ) బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేతుల్లో రాజకీయ అస్త్రంగా మారిందని మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యానించింది. తమిళనాడులో రూ.300 కోట్ల పోంజి కుంభకోణంపై సిబిఐ దర్యాప్తు కోరతూ దాఖలైన పిటిషన్పై మంగళవారం విచారణ జరిగినపుడు ఈ వ్యాఖ్యలు చేసింది. సిబిఐని ఇండియన్ ఎలక్షన్ కమిషన్ , కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్లా మరింత స్వతంత్రత కల్పించాలని న్యాయమూర్తులు కృపాకరన్, బి.పుహళేందిలు పేర్కొన్నారు. సిబిఐ స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ అని పార్ల మెంటుకు మాత్రమే జవాబుదారీగా ఉంటుందని పేర్కొంది. కంట్రోలర్, ఆడిటర్ జనరల్ లాగా సిబిఐకి కూడా స్వయం ప్రతిపత్తి ఉండాలని తెలిపింది. ఈ ఆదేశాలు బంధీగా ఉన్న చిలక (సిబిఐ)ని విడుదల చేసే యత్నమని వెల్లడించింది. గత కొన్నేళ్లుగా ప్రతిపక్ష నేతల విచారణలను మాత్రమే చేపట్టడంతో బిజెపి చేతుల్లో కీలు బొమ్మగా మారిందంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. బిజెపి డిమాండ్లు తీర్చే ఏజన్సీ అని, ”కాన్స్పిరెసీ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్” అని పలు విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే.