న్యూఢిల్లీ : సునంద పుష్కర్ మృతి కేసులో ఆమె భర్త, కాంగ్రెస్ పార్టీ నేత శశిథరూర్ ను ఢిల్లీ సెషన్స్ కోర్టు బుధవారం నిర్దోషిగా ప్రకటించింది. 2014 జనవరి లో సునంద పుష్కర్ హోటల్ గదిలో శవమై కనిపించారు. సునంద డ్రగ్స్ తీసుకున్నట్లు వైద్య నివేదిక సూచించింది. సునంద కేసును హత్య అనే కోణంలో పోలీసులు విచారణ జరిపారు. సునంద కేసులో ఐపీసీ సెక్షన్ 498 ఎ, 306 ఆత్మహత్యకు ప్రేరణ కింద శశిథరూర్ పై పోలీసులు కేసు నమోదు చేసి చార్జిషీట్ సమర్పించారు.