కాబూల్: ఆప్ఘనిస్థాన్లో యుద్ధం సంపూర్ణంగా ముగిసిందని తాలిబన్లు సోమవారం ప్రకటించారు. త్వరలోదేశాన్ని ఇస్లామిక్ ఎమిరేట్గా ప్రకటిస్తామనీ పేర్కొన్నారు. తాలిబన్లు రాజధానిని చుట్టుముట్టడంతో ఆదివారం అఫ్ఘాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ ఫరారయ్యారు. రక్త పాతాన్ని నివారించేందుకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఫేస్బుక్ లో ప్రకటించారు.